తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలి: కేసీఆర్​ - రైతు వేదిక ప్రారంభించిన సీఎం కేసీఆర్

రైతుల ధాన్యాన్ని ఇళ్ల వద్దనే కొనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు ఒక్క గింజ కూడా బయట అమ్మాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో రాష్ట్రాలు రాయితీలు ఇస్తామంటే.. కేంద్రం ఒప్పుకోవట్లేదని.. రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.

kcr
kcr

By

Published : Oct 31, 2020, 3:54 PM IST

రైతు అలిగితే దేశానికి తిండిపెట్టే పరిస్థితి ప్రపంచంలో ఎవరికీ ఉండదని ప్రధాని మోదీకి చెప్పినట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు, రైతులను, వ్యవసాయాన్ని ఆదుకోవాలని అనేకసార్లు ప్రధానికి సూచించినట్లు వెల్లడించారు. దేశానికి ప్రమాదం వస్తే ఆదుకునే శక్తి రైతులకే ఉందని పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించామని చెప్పారు. రైతులను కాపాడుకోవడానికి పిడికిలి బిగించి యుద్ధానికి కదలాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కొడకండ్లలో రైతు వేదికను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొడకండ్ల మార్కెట్ యార్డులో రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

రైతులంతా కళ్లెర్రజేసి కేంద్రం కళ్లు తెరిపించాలి : కేసీఆర్​

ఇతర దేశాల్లో రైతులకు రాయితీలు ఇస్తుంటారని సీఎం తెలిపారు. మన దేశంలో రాష్ట్రాలు సబ్సిడీలు ఇస్తామంటే కేంద్రం ఒప్పుకోవట్లేదని విమర్శించారు. రైతులకు ఎక్కువ ధర ఇస్తే మీ వడ్లు తీసుకోబోమని ఎఫ్‌సీఐ చెబుతోందని కేసీఆర్​ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు అధిగమించి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. సన్నరకాలు సాగుచేయమని సూచించానని.. తప్పకుండా మద్దతు ధర వచ్చేలా చూస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details