జనగామ జిల్లా, స్టేషన్ ఘనాపూర్ మండలం ఛాగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్న ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన కొప్పుల శ్రీధర్ అతని కుమారుడు సాయి కిరణ్ మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కుమారులు మృత్యువాత పడటంతో బంధువు శోకసంద్రంలో మునిగారు. అతి వేగమే ప్రమాదనికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం: తండ్రి కొడుకు మృతి - accident
జనగామ జిల్లా ఛాగల్ గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్‌కు చెందిన కొప్పుల శ్రీధర్ అతని కుమారుడు సాయి కిరణ్ మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం: తండ్రి కొడుకు మృతి