జనగామ జిల్లా బచ్చన్నపేట మండల విద్యాశాఖాధికారి ముత్తయ్య 10 వేలు లంచం తీసుకుంటూ... అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి గతనెల జులై 16, 17 తేదీల్లో అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లాడు. అదే రోజు పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈవో... తనకు చెప్పకుండా సెలవు తీసుకున్నందుకు రికార్డులో గైర్హాజరు వేశాడు.
మరుసటి రోజు జిల్లా విద్యాశాఖాధికారి తనిఖీ చేయగా... సమాచారం ఇవ్వకుండా సెలవు తీసుకున్నాడని చెప్పాడు. డీఈవో కూడా రికార్డుల్లో రిమార్కు రాశాడు. సస్పెండ్ చేయకుండా ఉండేందుకు కృష్ణారెడ్డి నుంచి ముత్తయ్య 25 వేలు డిమాండ్ చేశాడు. కృష్ణారెడ్డి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం... సోమవారం ఉదయం 10 గంటలకు ముత్తయ్యకు 10వేలు నగదు ఇస్తుండగా పట్టుకున్నారు. విచారించి ఏసీబీ కోర్టులో హాజరు పరుచుతామని అనిశా అధికారులు తెలిపారు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈవో
జనగామ జిల్లా బచ్చన్నపేట మండల విద్యాశాఖాధికారి ముత్తయ్య ఒక ప్రధానోపాధ్యాయుని వద్ద నుంచి 10 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎంఈఓ
ఇదీ చూడండి :ప్రజావాణికి తరలొచ్చిన ప్రజలు