తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు - metpally

‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతోకొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావైపోతారు’ అంటూ ఓ సినీ రచయిత చెప్పిన మాటలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. వారంతా యువకులు ఓ బృందంగా ఏర్పడి సేవ చేయాలనుకున్నారు. తలో కొంత మొత్తం వేసుకుని ఊర్లో సేవాకార్యక్రమాలు మొదలుపెట్టారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, రక్తదానం, మొక్కల పెంపకం ఇలా ఒకటేమిటి కాదేదీ సేవకు అనర్హం అంటున్నారు ఈ ఆదర్శ యువకులు.

సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు

By

Published : Jul 18, 2019, 8:46 PM IST

వారంతా యువకులు... మంచి మనసు.. ఆదర్శ భావాలున్న మార్గదర్శకులు. ఎదగడం అంటే తానొక్కడే కాదు తన చుట్టూ ఉన్న సమాజం ఎదుగేందుకు చేయూతనివ్వడం అని ఎరిగిన మారాజులు. జగిత్యాల జిల్లా మెట్​పల్లికి చెందిన కొందరు యువకులు సమాజానికి ఎదైనా చేయాలనే ఆలోచన ఓ మంచి కార్యానికి బీజం పడింది. ఆరేళ్ల కిందట ఐదుగురు స్నేహితులు కలిసి విద్యార్థులకు నోట్​ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అప్పటి నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సాధ్యమైనంత ఎక్కువ మందికి సాయం చేయాలని తలంచారు. ప్రస్తుతం వీరి గ్రూపులో 65 మందివరకు ఉన్నారు.

యువకులంతా ఫ్రెండ్స్​ వెల్ఫేర్​ ట్రస్ట్​ అనే సంస్థను ఏర్పాటు చేసి ఐదేళ్లుగా సర్కారు బడుల్లో చదువుతున్న పిల్లలకు ఏడాది సరిపడా సామగ్రి అందిస్తూ వారి చదువుకు బాసటగా నిలుస్తున్నారు. ఈ ఏడాది 1500 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్​ను ఉచితంగా అందించారు. జగిత్యాల, కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​ తదతర జిల్లాల్లో పర్యటించి పేదరికంలో ఉండి బాగా చదువుతున్న పిల్లలకు అవసరమైన విద్యాసామగ్రి అందిస్తున్నారు. పేద పిల్లలు వీరి సేవల పట్ల సంతోషంగా ఉన్నారు.

ఇతర సేవాకార్యక్రమాలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారంలో కూడా వీరు భాగస్వాములౌతున్నారు. ఏటా సుమారు రెండొందల మొక్కలు నాటి పెంచి పెద్దచేస్తున్నారు. మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులచే మొక్కలు నాటించి వాటిని బాగా పెంచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తామంటున్నారు.

అన్నింటా వారి సేవాహస్తం

అంతిమ యాత్రను గౌరవప్రదంగా చేసేందుకు వైకుంఠ రథం పేరిట ప్రత్యేక వాహనం చేయించి పేదలకు ఉచితంగా అందుబాటులో ఉంచారు. ఎవరికైనా రక్తం అవసరమంటే క్షణాల్లో అక్కడ వాలిపోతారు. ఇలా అవసరం ఏదైనా సహాయానికి తామున్నామంటూ ఆ యువకులు అందరికీ తల్లో నాలుకలా ఉన్నారు.

సాయం కావాలంటే ప్రత్యక్షమైపోతారు

ఇదీ చూడండి: చాక్లెట్లు తిన్నంత సులువుగా సాఫ్ట్​వేర్ కోడింగ్​

ABOUT THE AUTHOR

...view details