జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికెపల్లిలో ఉండే సత్యం రోజూ తాగి వచ్చి అతని భార్య లతను వేధిస్తున్నాడని.. ఆగ్రహించిన ఆమె కొడుకు శ్రవణ్‌తో కలిసి కలుపుతీసే కొడవలితో సత్యంపై దాడి చేశారు.
వేధింపులు తాళలేక భర్తపై దాడి చేసిన భార్య, కొడుకు
రోజూ తాగి వచ్చి తనను వేధిస్తున్నాడని కొడుకుతో కలిసి ఓ భార్య తన భర్తపై దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
వేధింపులు తాళలేక భర్తపై దాడి చేసిన భార్య, కొడుకు
గాయపడిన అతన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సత్యం పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వైద్యుల తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనిపై విచారణ జరుపుతున్నారు.