తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ దాత... మీ సహృదయతే మా విధిరాత!

విధి చేసిన గాయానికి బలైన ఆ అక్కాచెల్లెళ్లు.. కన్నవారిని కోల్పోయారు. 'నా' అనే వారు లేక.. ఉండటానికి సరైన గూడు లేక ఎముకలు కొరికే చలిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. అంత దీనస్థితిలోనూ.. తన చెల్లిని చదివించడానికి అక్క ఓ పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తోంది.

two sisters in veldurthi village in jagtial district don't have shelter to live
ఓ దాత... మార్చు మా విధిరాత

By

Published : Dec 10, 2019, 6:15 AM IST

Updated : Dec 10, 2019, 7:29 AM IST

ఓ దాత... మార్చు మా విధిరాత

జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన బిరుదుల రజిత, జ్యోతి ఇద్దరు అక్కా చెల్లెళ్లు... పదేళ్ల క్రితం తండ్రి చనిపోగా, తల్లి అనారోగ్యంతో నాలుగేళ్ళ క్రితం మరణించింది. ఉన్న నానమ్మ కుటుంబ కలహాల కారణంగా ఆ యువతులను ఒంటరి వాళ్లను చేసి వెళ్లిపోయింది.

గ్రామస్థుల సాయం

నా అనే వారు ఎవరు లేక ఆ యువతులిద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. గ్రామస్థుల సాయంతో ఓ చిన్న గుడిసె నిర్మించుకున్నారు. అక్క రజిత అదే గ్రామంలో 2,500 రూపాయల జీతానికి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేస్తోంది. ఆ జీతంతోనే ఇళ్లు గడుపుకుంటూ.. చెల్లి జ్యోతిని డిగ్రీ చదివిస్తోంది.

క్షణక్షణం.. భయం భయం

ఆ గుడిసెలోకి తరచూ పాములు వస్తున్నందున యువతులిద్దరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. పాముల భయంతో గుడిసెలో నిద్రించలేక.. వేరే వారి ఇంటికి వెళ్లలేక ఎముకలు కొరికే చలిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ప్రభుత్వం తమను ఆదుకుని ఓ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆ అక్కాచెల్లెళ్లు వేడుకుంటున్నారు. యువతుల దయనీయ స్థితి చూసి దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Last Updated : Dec 10, 2019, 7:29 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details