జగిత్యాల జిల్లా కేంద్రంలో పసుపు రైతులు ఆందోళనకు దిగారు. జిల్లా పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన రైతులు రహదారిపై రాస్తారోకో చేపట్టారు. క్వింటా పసుపుకు రూ.15,000 మద్దతు ధర ప్రకటించాలని, పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతుల ధర్నా - turmeric farmers protest in jagityala
పసుపుకు మద్దతు ధర ప్రకటించి, పసుపు బోర్డును ఏర్పాటు చేయాలంటూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ రైతుల ధర్నా
కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు యత్నించగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పరిస్థితి సద్దుమణిగాక సంయుక్త కలెక్టర్ రాజేశానికి రైతులు వినతిపత్రాన్ని అందజేశారు.
ఇవీచూడండి: మంచి, చెడు స్పర్శలపై మీ పిల్లలకు చెప్పారా