తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ డిపోల ముందు నిరుద్యోగుల క్యూ

ఎనిమిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం మొండి పట్టుతో వ్యవహరిస్తుండడం కార్మిక వర్గంలో ఆందోళన కలిగిస్తుంది. ఇదిలా ఉండగా నిరుద్యోగులు రోజురోజుకు ఆర్టిసీ డిపోల ముందు గంటల తరబడి రోజువారి కూలి కోసం పడిగాపులు కాస్తున్నారు.

ఆర్టీసీ డిపోల ముందు నిరుద్యోగుల క్యూ

By

Published : Oct 12, 2019, 12:57 PM IST

జగిత్యాల జిల్లాలో కోరుట్ల, మెట్​పల్లి, జగిత్యాల డిపోల పరిధిలో 263 బస్సులు ఉండగా... ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల 80 శాతానికి పైగా బస్సులు నడుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్న ప్రభుత్వ ప్రకటన.... రోజువారి కూలీ దొరుకుతుందనే ఆశతో నిరుద్యోగులు జగిత్యాల జిల్లాలోని అన్ని డిపోల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 3 గంటల నుంచే క్యూ లైన్​లలో నిల్చొని ఉద్యోగం కోసం చూస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీవ్రం కావడం... రోజు ఎంతో కొంత వస్తుందని ఆశతో పెద్ద సంఖ్యలో యువకులు డిపోల వద్దకు తరలివస్తున్నారు. మూడు నుంచి నాలుగు రోజులుగా క్యూ లైన్​లలో ఉన్నా పని దొరకడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ డిపోల ముందు నిరుద్యోగుల క్యూ

ABOUT THE AUTHOR

...view details