పాఠశాల గదులకు ఇలా అందంగా రైలు మాదిరిగా పెయింటింగ్ వేయించారు. పాఠశాల తరగతి గదులలో పిల్లలు ఇంటి వద్ద టీవీలో చూసే కార్టూన్ బొమ్మలు డోరా, బుజ్జి, శ్రీ కృష్ణ, హనుమాన్ లాంటి చిత్రాలను పెయింటింగ్ వేయించారు. వీటినిపిల్లలు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. పాఠశాలను చూసేందుకు గ్రామస్థులు వచ్చి వారి చరవాణిలో స్వీయ చిత్రాలు దిగుతున్నారు. ఇలా ఆకట్టుకునే రీతిలో ఉండడంతో పిల్లలు బడి బాట పట్టారు.
ఇంతటితో ఆగకుండా ఉపాధ్యాయులు విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. పాఠశాల ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో వివిధ రకాల పూల మొక్కలు నాటించారు. ప్రతి విద్యార్థి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి రోజు అరగంట పాటు వారికి యోగపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.