తెలంగాణ

telangana

ETV Bharat / state

పూజకు వెళ్లి వచ్చేసరికి... పూర్తిగా దోచేశారు... - LATEST THEFT INCIDENTS IN TELANGANA

జగిత్యాలలోని తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. 3 లక్షల నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు వాపోయారు.

THEFT IN JAGITYAL... VISUALS RECORDED IN CCTV

By

Published : Nov 13, 2019, 3:18 PM IST

జగిత్యాలలో దొంగలు రెచ్చిపోయారు. భవానినగర్‌ కాలనిలోని తాళమేసి ఉన్న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. భవానినగర్‌కు చెందిన తునికి జగదీష్‌ ఇంటికి తాళమేసి... అత్తగారింట్లో పూజకని వెళ్లాడు. ఉదయం వచ్చి చూస్తే... తాళం పగులగొట్టి ఉంది. లోపలికెళ్లి పరిశీలించగా.... రూ.3 లక్షల నగదు, 5 తులాల బంగారం పోయిందని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై జగిత్యాల పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. దొంగతనానికి వచ్చిన దుండగుల దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పూజకు వెళ్లి వచ్చేసరికి... పూర్తిగా దోచేశారు...

ABOUT THE AUTHOR

...view details