పచ్చని చెట్లు.. నిండుగా ఉన్న చెరువులతో జగిత్యాల జిల్లా ముగ్ధమనోహరంగా మారింది. దట్టమైన వృక్షాలతో పచ్చదనాన్ని పరుచుకున్న సారంగాపూర్ అడవి ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తోంది.
ప్రకృతి రమణీయం.. సారంగాపూర్ అటవీ సోయగం - jagtial district news
ఎటు చూసినా దట్టమైన వృక్షాలు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం.. మధ్యలో పచ్చని దుప్పటిని కప్పుకున్నట్లున్న ఎత్తైన కొండలతో జగిత్యాల జిల్లా సారంగాపూర్ అడవి కనువిందు చేస్తోంది. ఓ వైపు అటవీ అందాలు.. మరోవైపు బీర్పూర్ గుట్ట సోయగాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.
సారంగాపూర్ అటవీ సోయగం
చుట్టుపక్కల భారీ వృక్షాలతో అటవీ మార్గంలో వొంపులు తిరుగుతూ ఉన్న రహదారి ఆవైపు వెళ్లే ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. పచ్చదనంతో విరబూసిన ఈ అటవీ ప్రాంతంలో కాసేపు సేదతీరేందుకు వచ్చే ప్రకృతి ప్రేమికులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.
Last Updated : Oct 18, 2020, 4:11 PM IST