గడిచిన ఏడేళ్లలో రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. 2014కు ముందు 12 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే... ఇప్పుడు 53 లక్షల ఎకరాల్లో సాగవుతూ ధాన్యాగారంగా నిలుస్తోందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. పట్టణాలు, గ్రామాలు అనే తేడాలేకుండా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఏడేళ్లలో ఎన్నో అద్భుత విజయాలు: కొప్పుల - తెలంగాణ వార్తలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రం సాధించిన అద్భుత విజయాలను ప్రస్తావించారు.
కొప్పుల ఈశ్వర్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
కరోనా కాలంలోనూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత తెరాస ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంత, జగిత్యాల కలెక్టర్ రవి, జిల్లా ఎస్పీ సింధుశర్మ, పలుశాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:YS Sharmila: రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా నిరుద్యోగులకు చావే దిక్కు!