తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో స్మితాసబర్వాల్ పర్యటన - కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా.. గ్రామస్థుల సహకారంతో గ్రామాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితాసబర్వాల్ అన్నారు.

జగిత్యాల జిల్లాలో స్మితాసబర్వాల్ పర్యటన

By

Published : Oct 1, 2019, 5:20 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం మెట్ల చిట్టాపూర్ గ్రామాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితాసబర్వాల్ పర్యటించారు. ఇందులో భాగంగానే అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్ కార్డు కోర్టును పరిశీలించారు. ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కుతో పాటు అందులో నాటిన వివిధ రకాల మొక్కలను స్మితా సబర్వాల్ పరిశీలించారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని 30 రోజుల ప్రణాళిక కార్యాచరణ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంతో గ్రామాలన్నీ సుందరంగా తయారవుతున్నాయని తెలిపారు.

జగిత్యాల జిల్లాలో స్మితాసబర్వాల్ పర్యటన

ABOUT THE AUTHOR

...view details