జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం జరిపారు. కొవిడ్ దృష్ట్యా సాధారణ భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు.
నిరాడంబరంగా సీతారాముల కల్యాణం
మెట్పల్లిలో సీతారాముల కల్యాణాన్ని సాదాసీదాగా జరిపారు. అర్చకుల వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా దృష్ట్యా సాధారణ భక్తులను అనుమతించలేదు.
సీతారాముల కల్యాణం, మెట్పల్లిలో శ్రీరామనవమి
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఈ వేడుక నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని శ్రీరాముడిని కోరుకున్నట్లు అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి:'హనుమంతుడు జన్మించింది అంజనాద్రిలోనే'