నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించట్లేదని జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. వేతనాలపైన బతికే తమకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వేతనాల కోసం పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన - బకాయిలు విడుదల
జగిత్యాల జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు కన్నెర్ర చేస్తున్నారు. తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు.
తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలి : పారిశుద్ధ్య కార్మికులు