తెలంగాణ

telangana

ETV Bharat / state

మొక్క తొలగించినందుకు రూ. 5000 జరిమానా!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం చేపట్టింది. గ్రామాల్లోని అధికారులు కూడా అంతే పటిష్టంగా నాటిన మొక్కలను సంరక్షిస్తున్నారు. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో హరితహారం మొక్కలను తొలగించిన వారికి.. భారీగా జరిమనా విధించారు. మరోసారి ఫిర్యాదు అందితే పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Rs.5000 fine for plant removal In Jagityala
మొక్క తొలగించినందుకు రూ.5000 జరిమానా

By

Published : Jun 5, 2020, 10:45 PM IST

హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను తొలగించిన వారికి.. గ్రామపంచాయతీ అధికారి జరిమాన విధించిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. హబ్సీపూర్​లో నాటిన మొక్కలను మేకలు తిన్నందుకు వాటి యజమాని జనార్దన్‌కు పంచాయతీ అధికారి రూ. 5000లు జరిమానా విధించారు.

సంగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో చెట్లను తొలగించిన బక్కయ్య, రాజయ్య, మీనయ్యలకు రూ. 2000లు చొప్పున జరిమానా విధించగా.. మరో వ్యక్తి తిరుపతికి రూ. 1500 జరిమానా విధించారు. నాటిన మొక్కలు తొలగిస్తే జరిమనాతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు. మొక్కలను సంరక్షించుకోవడం అందరి బాధ్యత అని తొలగిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?

ABOUT THE AUTHOR

...view details