జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో ఇళ్ల మధ్యలోకి కొండచిలువ వచ్చి.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ అడవి పిల్లిని కొండచిలువ అమాంతం చుట్టేసి మింగడానికి ప్రయత్నించింది. కొండచిలువను గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
జనావాసాల్లోకి కొండచిలువ.. భయాందోళనలో ప్రజలు
జనావాసాల మధ్యలోకి కొండచిలువ వచ్చిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన అడవి పిల్లిని కొండచిలువ అమాంతం మింగేయాలని చూసింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
జనావాసాల్లోకి కొండచిలువ.. పట్టుకున్న అటవీ అధికారులు
ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు కొండచిలువను పట్టుకొని ఓబులాపూర్ అడవుల్లో వదిలేశారు. గత కొన్ని రోజులుగా ఇళ్లలో పెంచుకునే కోళ్లు మాయమవుతుండటం చూసి స్థానికులు కొంత ఆందోళనకు గురయ్యారు. శనివారం అడవి పిల్లిని మింగి అందరి కంట కొండచిలువను చూసి.. ఇన్నిరోజులు కోళ్లను మింగేసింది కొండచిలువే అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చూడండి: జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత