విద్యారంగ సమస్యలు పరిష్కరించాలంటూ.. ఏబీవీపీ ఆధ్యర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తా వద్ద కళ్లకు గంతలు కట్టుకుని విద్యార్థి నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఫీజు ఎయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల చాలా మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఉపకార వేతనాలు కోసం కళ్లకు గంతలతో నిరసన - ఏబీవీపీ
విద్యార్థులకు రావాల్సిన ఉపకార వేతనాలు చెల్లించాలంటూ... జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన నిర్వహించారు.
ఆందోళన