జగిత్యాలలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను జగిత్యాల పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్‌లో జిలెటిన్ స్టిక్స్, అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు తరలిస్తుండగా జగిత్యాల-గొల్లపల్లి రోడ్డులో పోలీసులు పట్టుకున్నారు. కొడెం ప్రవీణ్, హన్మంతరావు, ట్రాక్టర్ డ్రైవర్ నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి మంద అంజయ్యతో పాటు మెుత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు.
పేలుడు పదార్థాల పట్టివేత... నలుగురిపై కేసు - జగిత్యాలలో పేలుడు పదార్థాల పట్టివేత... నలుగురిపై కేసు నమోదు
జగిత్యాలలో ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాలలో పేలుడు పదార్థాల పట్టివేత... నలుగురిపై కేసు నమోదు
ఎలాంటి అనుమతి తీసుకోకుండా బండలను పేల్చేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ, ఏఆర్ డీఏస్పీ ప్రతాప్ వివరాలు వెల్లడించారు.
ఇవీ చూడండి: సెల్‌పోన్ కొనుక్కోవడానికి దొంగతనం.. చివరికి జైలుకి...