తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్యపై తుపాకీతో కాల్పులు..అడ్డొచ్చిన మేనమామకు బుల్లెట్లు.. - జగిత్యాలలో తుపాకీతో కాల్పులు

భార్యను చంపడం కోసం ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మేనమామకు బుల్లెట్లు తగిలాయి.

piston firing in jagityala
తుపాకీతో కాల్పులు.. భార్యను చంపడం కోసమే..

By

Published : Feb 4, 2020, 7:36 AM IST

భార్యను హత్య చేసేందుకు భర్త.. కాల్పులు జరపడం కలకలం రేపింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారానికి చెందిన శ్రీనివాస్‌, గీతిక దంపతుల మధ్య 8 నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. విసుగుచెందిన గీతిక కొన్నిరోజులుగా తన బిడ్డతో కలిసి ఇస్రాజ్‌పల్లిలోని తన మేనమామ రాజిరెడ్డి ఇంట్లో ఉంటుంది.

తుపాకీతో కాల్పులు.. భార్యను చంపడం కోసమే..

సోమవారం అర్ధరాత్రి సమయంలో భార్య దగ్గరికి వచ్చిన శ్రీనివాస్‌... ఇంట్లోవాళ్లతో గొడవకు దిగాడు. తుపాకీతో భార్యను కాల్చేందుకు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన రాజిరెడ్డికి రెండు బుల్లెట్లు తగిలి గాయపడటం వల్ల కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు.

ఇంతకీ నిందితుడు శ్రీనివాస్‌కు తుపాకీ ఎలా వచ్చింది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'భరణం ఇప్పించమంటే.. బలత్కారానికి ఒడిగట్టాడు'

ABOUT THE AUTHOR

...view details