కరోనా మహమ్మారితో నిలిచిపోయినా పాఠాలు జగిత్యాల జిల్లాలో పరోక్ష బోధనతో ఆన్‌లైన్ తరగతులు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. 3 నుంచి 10వ తరగతి వరకు ప్రారంభించే ఈ బోధనను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేందుకు వారి వారి ఇళ్లల్లో టీవీల ముందు అతుక్కుపోయి పాఠాలు వింటున్నారు.
జగిత్యాల జిల్లాలో ప్రారంభమైన ఆన్‌లైన్ తరగతులు.. - corona virus latest news
కరోనా నేపథ్యంలో మూడు నెలలు ఆలస్యంగా బడులు తెరుచుకున్నాయి. విద్యార్థులు ఇంటి నుంచే ఆన్లైన్లో పాఠాలు నేర్చుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు వారివారి ఇళ్లల్లో టీవీల్లో పాఠాలు వింటున్నారు.
జగిత్యాల జిల్లాలో మొత్తం 34,992 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో చదువుతుండగా వారిలో 1920 మందికి ఎలాంటి సదుపాయాలు లేవని సర్వేలో తేలింది. ఆన్‌లైన్, డిజిటల్ తరగతులు వినే సదుపాయం గల వారు 33వేల 782 మంది ఉన్నారు. స్మార్ట్‌ఫోన్లు కలిగి నెట్ సౌకర్యం లేని వారు 11544 మంది, చరవాణి నెంబర్లు గల విద్యార్థులు 28వేల 897 మంది అని తేల్చారు.
స్మార్ట్‌ఫోన్లు, టీవీలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి సమీపంలో ఈ వసతులు లేని విద్యార్థులకు సహకరించేలా ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపాధ్యాయులు వారి ఇళ్లకు వెళ్లి పాఠాలు వింటున్నారా లేదా అని గమనిస్తున్నారు. కొన్ని చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగగా.. మరికొన్ని చోట్ల టీవీలు లేని వారు పక్క ఇంట్లో తిలకిస్తున్నారు.. ఉపాధ్యాయులు కూడా ఆన్‌లైన్
తరగతులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌కు కరోనా పాజిటివ్