ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ను విడుదల చేసింది. రాష్ట్రంలో అతి ప్రాచీన పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఆదాయం ఏటా 5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఆలయ ధర్మక్రర్తల మండలి పదవీకాలం గతేడాది జూన్ మాసంలో ముగిసింది.
ధర్మపురి ఆలయ ధర్మకర్తల మండలికి దేవాదాయశాఖ నోటిఫికేషన్ - jagityala latest news
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసేందుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 15 మందితో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం భర్తీ చేయనుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి ప్రోటోకాల్ హొదాతో ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం.
ధర్మపురి ఆలయ ధర్మకర్తల మండలికి దేవాదాయశాఖ నోటిఫికేషన్
పాలకమండలి లేకపోవడం వల్ల పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆలయ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 50 కోట్ల నిధులను కేటాయించారు. ప్రముఖ వాస్తు, ఆగమ శాస్త్ర పండితులు పలుమార్లు ఆలయాన్ని సందర్శించి భక్తజనం మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధికి పలు విధివిధానాలను ఖరారు చేశారు. ఈ మేరకు నివేదిక సిద్దం చేశారు.
15 మందితో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం భర్తీ చేయనుంది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి ప్రోటోకాల్ హొదాతో ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం.