ETV Bharat / state
కొంచెం కావాలనుకుంటే మొత్తం ముంచెత్తింది
తమ పంటలకు నీరు అందడంలేదని గుర్తు తెలియని కొందరు కాలువ తూమును పైకి లేపారు. ఫలితంగా నీటి ఉద్ధృతి పెరిగి దాదాపు 10 ఎకరాలు నీట మునగడానికి కారణమైంది.
నీటమునిగిన పంటలు
By
Published : Mar 20, 2019, 9:56 AM IST
| Updated : Mar 20, 2019, 11:00 AM IST
జగిత్యాలలో డి-3 ఎస్సారెస్పీ తూమును గుర్తుతెలియని వ్యక్తులు పైకి లేపారు. ప్రవాహం పెరిగి కాలువపై నుంచి పొలాల్లోకి ప్రవేశించింది. దాదాపు 10 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలువ కింది భాగంలోని పంటలకు నీరు అందడం లేదని రైతులు ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని తూము మూసేశారు. Last Updated : Mar 20, 2019, 11:00 AM IST