సాంకేతిక సమస్యలు తలెత్తకుండా...
తొలిసారి 12ఈవీఎంలను ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఈవీఎం యంత్రాల్లో 185 మంది అభ్యర్థుల ఫొటోలు ఉంటాయి. ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు 600మంది ఇంజినీర్లను ఇందుకోసం నియమించారు. వీరంతా హైదరాబాద్, బెంగళూరు నుంచి ఇప్పటికే నిజామాబాద్, జగిత్యాల చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఈ ఓటింగ్ నమూనా కేంద్రంలో ఓటర్లకు ఈవీఎంలపై అవగాహన కల్పించనున్నారు.
జగిత్యాల, కోరుట్లలో మోడల్ పోలింగ్ కేంద్రాల ప్రారంభం
నిజామాబాద్లో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. నిన్న జగిత్యాల చేరుకున్న ఇంజినీరింగ్ అధికారులు.. పన్నెండు ఎం3 ఈవీఎంలను అనుసంధానం చేసి మొత్తం 185 మంది అభ్యర్థుల పేర్లను నిక్షిప్తం చేశారు. జగిత్యాలలో ఇలా ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఓటర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
12 ఈవీఎం యంత్రాలు
ఇవీ చూడండి:నిజామాబాద్లో వార్ వన్ సైడే: కవిత
Last Updated : Apr 4, 2019, 3:39 PM IST