ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దశాబ్ధకాలంగా కొనుగోలు కేంద్రాల నుంచే ధాన్యం సేకరణ జరుగుతోంది. ఓ పద్దతి ప్రకారం ఎక్కడికక్కడా రైతుల సహకారంతో కొనుగోలు చేస్తారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. టోకెన్లు జారీ చేసిన ప్రకారమే రైతులు ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురావాలని, అప్పటి వరకు పొలాల్లోనే ఆరబెట్టుకోవాలన్న నిర్ణయంతో రైతులపై అదనపు రవాణా ఛార్జీలు, కూలీల భారం పడుతోంది.
పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్‌రెడ్డి - mlc jeevanreddy demand to old process
ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ పాత విధానంలోనే ధాన్యం సేకరణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిబంధనలు మార్చి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పాత పద్ధతిలోనే ధాన్యం సేకరించాలి: జీవన్‌రెడ్డి