సెల్ఫీ తీసుకుని మరణ వాంగ్మూలంతో ఆస్పత్రిలో కరోనాతో మృతి చెందితే.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించకుండా మంత్రి ఈటల రాజేందర్ సెల్ఫీ వీడియోను తప్పు పట్టడం ఆశ్చర్యాన్ని కల్గిస్తోందని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి అన్నారు. కరోనా నివారణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని విమర్శించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించపోవటం బాధాకరమన్నారు. సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
'మరణ వాంగ్మూలాన్ని మంత్రి తప్పుపట్టడం బాధాకరం' - jagityala district latest news
కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్ వైద్యం అందించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని జిల్లాలో సాయంత్ర 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించాలన్నారు.
కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జీవన్ రెడ్డి
దురదృష్ట ఘటనలను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఒకవేళ హెచ్ఆర్సీ స్పందించకపోతే తామే కలుస్తామన్నారు. కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్ వైద్యం అందించాలని కోరారు.
ఇదీ చదవండి:59 చైనా యాప్‌లపై నిషేధం