కాళేశ్వరం ప్రాజెక్టుతో 100 టీఎంసీల గోదావరి జలాలు ఎత్తి పోసిన మెట్ట ప్రాంత రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పునరాకృతి పేరుతో వాస్తవ లక్ష్యాన్ని నీరుగార్చారని జీవన్ రెడ్డి అన్నారు.
ప్రభుత్వం సవతితల్లి ప్రేమను ప్రదర్శిస్తోంది: జీవన్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం రీడిజైన్ పేరుతో అన్యాయం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు. కేవలం 10 కోట్ల రూపాయలు వెచ్చిస్తే రెండు మండలాలు సస్యశ్యామలంగా ఉంటాయని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించిన కేసీఆర్.. ప్రస్తుతం ఫామ్‌హౌస్ పట్ల శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. కేవలం 10 కోట్ల రూపాయలు వెచ్చించి కొడిమ్యాల, మేడిపల్లి మండలాలకు నీరు అందించవచ్చన్నారు. కానీ ఈ ప్రాంతం పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని ధ్వజమెత్తారు. రాజకీయాలకతీతంగా రైతులను సమీకరించి త్వరలో సాగునీటి కోసం ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ఉస్మానియాను పునరుద్ధరిస్తారా లేక కొత్తగా నిర్మిస్తారా?: హైకోర్టు