మిషన్ భగీరథ పనులను త్వరితగతిన పూర్తి చేసి పట్టణ ప్రజలకు నీటిని అందించాలని అధికారులకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో ఛైర్ పర్సన్ రానావేణి సుజాత అధ్యక్షతన మిషన్ భగీరథ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లతో మిషన్ భగీరథ పనులపై అవగాహన కల్పించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
భగీరథ పనులు త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే విద్యాసాగర్ - metpally latest news
జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో ఛైర్ పర్సన్ సుజాత అధ్యక్షతన మిషన్ భగీరథ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లతో మిషన్ భగీరథ పనులపై అవగాహన కల్పించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
mla vidyasagar review on mission bhagiratha works
పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా సత్వరమే పూర్తి చేయాలని ప్రజలకు నీటిని అందించాలని సుజాత ఆదేశించారు. అనంతరం వార్డుల్లో విద్యుత్ సమస్య ఎక్కడ ఉన్నా.. అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ సమస్యలపై సమాచారం ఇచ్చిన వెంటనే వాటికి పరిష్కారం చూపించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.