రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి నీటిని అందిస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా పట్టణంలో మూడు వాటర్ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
'రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే తెరాస ప్రభుత్వ లక్ష్యం' - 3 water tank works started in metpally
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా మూడు వాటర్ట్యాంకుల నిర్మాణానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ భూమి పూజ చేశారు. పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
mla kalvakuntla vidyasagar started bhageeratha tank works in metpally
పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు నీటిని అందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అతి త్వరలోనే పనులు పూర్తి చేసి ఇంటింటికి శుద్ధ జలం అందిస్తామని హామీ ఇచ్చారు.