తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం: మంత్రి కొప్పుల - సీసీ రోడ్లకు భూమి పూజ

జగిత్యాల జిల్లా రాయికల్​ మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ పర్యటించారు. రూ.3 కోట్ల 65 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు . కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కొత్త మున్సిపాల్టీలను అభివృద్ధి చేస్తాం: కొప్పు

By

Published : Aug 24, 2019, 11:26 PM IST

కొత్త మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తాం: మంత్రి కొప్పుల
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మెుదటి స్థానంలో నిలుస్తున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. ఇది సహించలేకే ప్రతి పక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 3 కోట్ల 65 లక్షలతో నిర్మించే సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రతి ఎకరానికి నీరందిస్తామన్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details