Minister KTR Visit: రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్‌పల్లిలో పర్యటించారు. కోరుట్ల శివారులో నిర్మించిన 103 రెండు పడకల గదుల ఇళ్లను ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించి ముచ్చటించారు. కేటీఆర్‌తోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. హనుమాన్ ఆలయ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సొంత నిధులతో ఏర్పాటు చేసిన 56 అడుగుల కోదండ రాముడి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. మెట్‌పల్లిలో ఉచిత పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్‌పల్లి మండలంలో ధాత్రి బయో సంస్థ రూ.160 కోట్లు, భువి బయో సంస్థ రూ.1060 కోట్ల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించనుంది. ఈమేరకు అవగాహ ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిద్వారా 2వేల మందికిపైగా ఉపాధి దొరకనుంది. వి-ఫై అనే ఐటి సంస్థ కోరుట్ల ప్రాంతంలో 200 మందికి ఉపాధి కల్పిస్తూ కాల్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.
'ఆదర్శవంతమైన తెలంగాణను దేశం ముందు పెడుతున్నాం' - KTR visit in jagityal
Minister KTR Visit: ఆదర్శవంతమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్... దేశం ముందుపెడుతున్నారని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విద్యా, వైద్య రంగాలను ప్రగతిలోకి తీసుకువచ్చేందుకు.. ప్రభుత్వం ముందుకెళ్తోందని పేర్కొన్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి.. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.
అనంతరం... సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో.. 'మన ఊరు మన బడి' కార్యక్రమంలో భాగంగా.. 2 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామని.. విద్య, వైద్యరంగాలను ముందు తీసుకెళ్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. మల్కపేట రిజర్వాయర్‌ను జూలై, ఆగష్టు నెలల్లో కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే వేములవాడ నియోజకవర్గంలో... ఆహారశుద్ధి రంగానికి సంబంధించి... ఇథనాల్ పరిశ్రమను.. డక్కెన్ అగ్రీ రిసోర్సెస్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తుందని.. మంత్రి ప్రకటించారు.
ఇవీ చూడండి: