జగిత్యాల జిల్లాకు చెందిన 42 మంది యాత్రికులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి కాశీలో చిక్కుకున్నారు. వారి ఇబ్బందులపై ఈటీవీ తెలంగాణలో కథనం ప్రసారం చేశారు. బాధితులు కూడా ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను సాయం కోరారు. వెంటనే ఆయన స్పందించారు.
కాశీలో చిక్కుకున్న 48 మంది.. స్పందించిన కేటీఆర్
కాశీలో చిక్కుకున్న జగిత్యాల యాత్రికులు ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని మంత్రి కేటీఆర్ కోరారు. యూపీలో చిక్కుకున్న 42 మంది తెలంగాణ వాసులపై ఈటీవీ తెలంగాణలో కథనం ప్రసారం చేశారు. ఆ అంశంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందించారు.
కాశీలో చిక్కుకున్న 48 మంది.. స్పందించిన కేటీఆర్
రోడ్డు మార్గాన జగిత్యాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డిని కేటీఆర్ కోరారు. జగిత్యాల జిల్లాతోపాటు నిర్మల్‌కు చెందిన ఆరుగురితో మొత్తం 48 మంది కాశీలో ఉన్నారు. ఎక్కువగా వృద్ధులు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కేటీఆర్ చొరవతో బాధితులు త్వరలోనే స్వస్థలాలకు చేరుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి :'మాస్కులు, శానిటైజర్లు ఇవ్వట్లేదు...జీతాలూ ఆపేశారు'