మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. దిల్లీలో కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, రాందాస్ అథవాలె, రమేశ్ పొఖ్రియాల్‌తో భేటీ అయ్యారు. గురుకుల పాఠశాలల భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలని కొప్పుల కోరారు.
'మేడారం జాతరను గిరిజన కుంభమేళాగా గుర్తించండి'
మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని, కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రులను కోరినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. దిల్లీ పర్యటనలో ఉన్న కొప్పుల.. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, రామ్‌దాస్ అథవాలెతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
'మేడారం జాతరను గిరిజన కుంభమేళాగా గుర్తించండి'
Last Updated : Aug 2, 2019, 6:06 PM IST