తెలంగాణ

telangana

ETV Bharat / state

పశు సంపద పెంచేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా కొసునూరులో మెగా పశు వైద్య శిబిరాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రారంభించారు. అనంతరం గోకల్​ మిషన్​కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

పశు సంపద పెంచేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి కొప్పుల

By

Published : Jul 22, 2019, 5:58 PM IST

పశు సంపదను పెంచేందుకు తెరాస ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో పీవీ నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మెగా పశు వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఎన్​ఎస్​స్ఎస్ శిబిరాల ద్వారా క్షేత్ర స్థాయిలో విద్యార్థులు మరిన్ని విషయాలు నేర్చుకోవచ్చని తెలిపారు. పిండ మార్పిడి పద్ధతి ద్వారా దేశీయ జాతి ఆవుల సంతతిని రాష్ట్రంలో అభివృద్ధి పరచడం కోసం గోకుల్ మిషన్ ద్వారా చేపట్టిన శాస్త్రీయ ప్రయోగానికి సంబంధించిన కరపత్రాన్ని మంత్రి ఆవిష్కరించారు.

పశు సంపద పెంచేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి కొప్పుల

ABOUT THE AUTHOR

...view details