జగిత్యాల ధరూర్ క్యాంపులో తెరాస పార్టీ కార్యాలయానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి భూమి పూజ చేశారు. మంత్రి గడ్డపారతో పునాది తవ్వగా ఎమ్మెల్యే మట్టిని తోడారు. దేశంలో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి కొప్పుల అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు హాజరయ్యాయి.
తెరాస పార్టీ కార్యాలయానికి కొప్పుల భూమి పూజ - minister
సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి జగిత్యాలలో తెరాస పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శంకుస్థాపన చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే