తెలంగాణ

telangana

ETV Bharat / state

Koppula Eshwar: డబుల్​ బెడ్​రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​

Koppula Eshwar: పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రారంభించారని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూర్​లో 12, కొండ్రికర్ల గ్రామంలో 12 రెండు పడక గదుల ఇళ్లను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.

Koppula Eshwar: డబుల్​ బెడ్​రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​
Koppula Eshwar: డబుల్​ బెడ్​రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​

By

Published : Jan 1, 2022, 8:13 PM IST

Koppula Eshwar: పేదలకు డబుల్ బెడ్​రూం ఇల్లు ఉండాలని దేశంలో మొట్టమొదటి ఆలోచన చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఆత్మకూర్​లో 12, కొండ్రికర్ల గ్రామంలో 12 రెండు పడక గదుల ఇళ్లను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.

పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను ప్రారంభించారని మంత్రి అన్నారు. రైతాంగం బాగుండాలని ఆలోచన చేసి రైతుబంధు, రైతు భీమా, 24 గంటల విద్యుత్ సరఫరా లాంటి పథకాలు పెట్టిన మహా వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడుస్తుందని.. ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ ప్రారంభించారు.

Koppula Eshwar: డబుల్​ బెడ్​రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​

'పేదలకు డబుల్​ బెడ్​రూం ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్​. గ్రామం స్థితిగతిని మార్చే కార్యక్రమం పల్లెప్రగతి. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్​ అనేక పథకాలను తీసుకొచ్చారు. గ్రామాలు, ప్రజలు బాగుండాలని గొప్ప కాన్సెప్ట్​ తీసుకొచ్చారు.' -కొప్పుల ఈశ్వర్​, రాష్ట్ర మంత్రి

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details