తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటో డ్రైవర్లకు మంత్రి కొప్పుల నిత్యావసరాలు పంపిణీ - ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ తాజా వార్తలు

జగిత్యాలలో 130 మంది ఆటో డ్రైవర్లకు, పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు అందజేశారు మంత్రి కొప్పుల ఈశ్వర్​. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి లాక్​డౌన్​కు సహకరించాలని కోరారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భోగ శ్రావణి పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్లకు మంత్రి కొప్పుల నిత్యావసరాలు పంపిణీ
ఆటో డ్రైవర్లకు మంత్రి కొప్పుల నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 25, 2020, 8:00 PM IST

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఉమాశంకర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌.. ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. పలువురు దాతల ద్వారా నిత్యావసర సరకులను ఏర్పాటు చేసి.. 130 మంది ఆటో కార్మికులు, పేద కుటుంబాలకు అందజేశారు. అనంతరం వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి లాక్​డౌన్​కు సహకరించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్​ కోరారు. స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు దావ వసంత, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భోగ శ్రావణి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్

ABOUT THE AUTHOR

...view details