'మూడు నెలల్లో సాగునీటి సమస్య పరిష్కరిస్తాం' - koppula eeshwar
గ్రామాల అభివృద్ధి కోసమే ముఖ్య మంత్రి కేసీఆర్ ... 30 రోజుల ప్రణాళిక చేపట్టారని... పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. మూడు నెలల్లోగా కొడిమ్యాల మండల ప్రజల సాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
'మూడు నెలల్లో సాగునీటి సమస్య పరిష్కరిస్తాం'
మూడు నెలల్లో కొడిమ్యాల మండల ప్రజల సాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం హిమ్మత్ రావు పేటలో.. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, రహదారులను పరిశీలించారు. స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. అందరు కలిసి కట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.
- ఇదీ చూడండి : మంత్రులు ఎర్రబెల్లి, కొప్పులకు చేదు అనుభవం