జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో దూసుకుపోతుందని... మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పురాతన ఖిల్లాలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రసంగించారు. జగిత్యాల జిల్లా 20 అంశాల్లో రాష్ట్రంలోనే ముందుందని తెలిపారు. ఈసారి కోతులను అడవులకు పంపేందుకు అడవుల్లో పండ్ల మొక్కల పెంపకం చేపట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా 2.74 కోట్ల మొక్కలు నాటుతున్నామని మంత్రి తెలిపారు. ఈ వేడుకలకు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది: మంత్రి కొప్పుల ఈశ్వర్ - koppula
జగిత్యాల జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై... జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
కొప్పుల ఈశ్వర్
ఇవీ చూడండి: 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ: కేసీఆర్