కరోనా వైరస్ కారణంగా వలస కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనతా కర్ఫ్యూ కంటే రెండు రోజుల ముందుగా జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చేరుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులు... ఇన్నాళ్లు ఇక్కడ పనిలేకపోవటం వల్ల తిరిగి తమ రాష్ట్రానికి కాలి నడకన బయలుదేరి వెళ్లారు. మహిళలతో కలిపి మొత్తం 13 మంది ఉన్నారు. జగిత్యాలలో కాలి నడకన వెళుతున్న కూలీలను గుర్తించిన పోలీసులు వారి వివరాలు సేకరించారు.
జగిత్యాల నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడకన బయలుదేరిన కూలీలు - labour
పని కోసమని వచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులు కాలి నడకన తిరుగు పయనమయ్యారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల నుంచి 13 మంది బయలుదేరి వెళ్లారు.
జగిత్యాల నుంచి మధ్యప్రదేశ్‌కు కాలినడకన బయలుదేరిన కూలీలు
మధ్యప్రదేశ్‌కు చేరాలంటే 300 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుందని వారు తెలిపారు.. వాహన సౌకర్యం లేకపోవటంతో కాలినడకన వెళుతున్న వారికి తాగునీరు, పండ్లను కొందరు స్థానికులు అందజేశారు.. ఎలాగైన ఇంటికి చేరుకుంటే అదే చాలని కూలీలు తెలిపారు.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఇలాంటి వలస కూలీలను స్వగ్రామాలకు చేర్చాలని ఆ కార్మికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 644కు చేరిన కరోనా కేసులు