ఖాతాదారులకు అవసరాలకు రుణాలిచ్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించడమే తమ లక్ష్యమని ఆంధ్రాబ్యాంక్ తెలంగాణ సర్కిల్ జనరల్ మెనేజర్ అవధానులు అన్నారు. జగిత్యాలలోని సుమంగళి కల్యాణ మండపంలో 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధ్వర్యంలో ఖాతాదారులకు బ్యాంకులు అందిస్తున్న రుణాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ, డ్వాక్రా, గృహ, విద్యా తదితర రుణాలపై బ్యాంకర్లు ఖాతాదారులకు వివరించారు. సదస్సుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు తరలివచ్చారు. 13 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఖాతాదారులకు 25 కోట్ల రూపాయల రుణాలను ఖాతాదారులకు మంజూరు చేసి.. పలువురికి చెక్కులు అందించారు. నిన్న ప్రారంభమైన సదస్సు ఇవాళ కూడా కొనసాగనుంది.
ఖాతాదారులతో బ్యాంక్ అధికారుల సమావేశం - సమావేశం
జగిత్యాలలో సుమంగళి కల్యాణ మండపంలో 13 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆధ్వర్యంలో ఖాతాదారులకు బ్యాంకులు అందిస్తున్న రుణాలపై అవగాహన కల్పించారు.
జగిత్యాల జిల్లాలో ఖాతాదారులతో బ్యాంక్ అధికారుల సమావేశం
Last Updated : Oct 4, 2019, 11:17 AM IST
TAGGED:
సమావేశం