జగిత్యాల పట్టణంలో వలస వచ్చిన వాళ్లతో పాటు... పట్టణంలో జీవించే ప్రజలు లక్షా యాభై వేల వరకు ఉన్నారు. ఇంత పెద్ద పట్టణానికి ఒకే కూరగాయల మార్కెట్ ఉండటం.. సమస్యగా మారింది. టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న 50ఏళ్లనాటి మార్కెట్ అభివృద్ధికి నోచుకోకపోవటం వల్ల కూరగాయలు కొనేందుకు వస్తోన్న ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారిపైనే కూరగాయలు అమ్ముతుండటంతో నిత్యం ట్రాఫిక్ సమ్యసలు తప్పడం లేదు
మార్కెట్లో 40 లక్షలతో ఒక షెడ్ నిర్మించినా.. ఉపయోగం లేకుండా పోయింది. షెడ్ లోపల వ్యాపారులు ఉంటుండగా... రైతులు రోడ్లపైనే అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించవలసిన పాలక వర్గం.. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది.