తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతిపై ముగ్గులు, వ్యాస రచన పోటీలు - ముగ్గుల పోటీలు

జగిత్యాలలో పల్లె ప్రగతి కార్యక్రమంపై మండల స్థాయి వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు.

mandal level competitions on pallepragathi in jagityala
పల్లె ప్రగతిపై ముగ్గులు, వ్యాస రచన పోటీలు

By

Published : Jan 20, 2020, 8:18 PM IST

తెలంగాణ సర్కారు గ్రామాల రూపురేఖలు మార్చేందుకు చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో మహిళలకు ముగ్గుల పోటీలు.. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు జరిగాయి.

ఉత్తమంగా ప్రతిభ కనపరిచిన వారికి మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. జగిత్యాల మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన ముగ్గులు వేశారు. విద్యార్థులకు పల్లె ప్రగతిపై వ్యాసరచన పోటీలు జరిగాయి. ఉత్తమంగా నిలిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.

పల్లె ప్రగతిపై ముగ్గులు, వ్యాస రచన పోటీలు

ఇదీ చదవండి:నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

ABOUT THE AUTHOR

...view details