తెలంగాణ

telangana

ETV Bharat / state

Mallapur Model School Problems : ఇది పాఠశాలనా లేక... సమస్యల అడ్డానా..?

Mallapur Model School Problems : పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన సరస్వతి నిలయం... సమస్యలమయంగా మారింది. వసతి గృహంలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తాగటానికి మంచి నీరులేక, వ్యాధుల బారిన పడితే సమయానికి మందులు ఇచ్చే వార్డెన్‌ రాక ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే సరైన రోడ్డు మార్గం కూడా లేదు. మధ్యాహ్న భోజన తయారీకి వంటగదిలేక పాఠశాలలో అన్నింటా సమస్యలు తాండవిస్తున్నాయి. చదువుకోవాల్సిన సమయంలో సమస్యలతో పోరాడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Govt School Problems in Jagtial
Mallapur Government Model School

By

Published : Aug 19, 2023, 11:53 AM IST

Mallapur Government Model School Problems ఇది పాఠశాలనా లేక... సమస్యల అడ్డానా..?

Mallapur Model School Problems : జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మోడల్ స్కూల్‌లో (Govt School Problems in Jagtial) సమస్యలు తాండవిస్తున్నాయి. పాఠశాలలో పిచ్చి మెుక్కలు దట్టంగా పెరిగి అటవిని తలపిస్తుంది. ఇక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉన్న దాదాపు 700మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సరైన తాగునీరు లేక విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నారు. వారికి కనీసం మందు బిళ్లలు ఇవ్వడానికి కూడా బాలికల వసతి గృహంలో ఏఎన్‌ఎమ్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు చెప్పుకుందామంటే వార్డెన్‌ కూడా నెలలు తరబడి సెలవులు పెట్టారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు ఆటంకంగా మారిన సమస్యలను పరిష్కరించి తమ చదువులకు సౌకర్యం కల్పించాలనికోరుతున్నారు.

"వంట డబ్బులు ఇవ్వడం లేదు. వంట చేయడానికి గుడిసె వేసుకున్నాం. గాలి దుమారానికి వంట చేయడం కష్టంగా ఉంది. కోతులు వస్తున్నాయి.. వర్షం పడితే అంతా తడిసిపోతోంది. మాకు వంట చేయడానికి ఒక గది కట్టిస్తే బాగుంటుంది." - మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు

Gurukula School Problems: ఆ గురుకులంలో విద్యార్థులకు అన్నీ హాల్లోనే..!

Model School Problems in Jagtial పాఠశాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారి నుంచి పంట పొలాల మధ్యగా మట్టి రోడ్డులో వెళ్లాలి. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డు కొట్టుకుపోతుంది. దీంతో పాఠశాలకు వెళ్లాలంటే విద్యార్థులు నానాఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులు (Lack Facilities in TS Govt school) చేయించి చేతులు దులుపుకుంటున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనికి తోడు మధ్యాహ్న భోజనం వండటానికి వంటశాల లేక నిర్వాహకులు తాత్కాలికంగా గుడిసెను ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్నారు. వారికి సకాలంలో వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"హాస్టల్‌లో ఉంటున్నాం కానీ మాకు కనీస సదుపాయాలు లేవు. మధ్య రాత్రి ఏదైనా ఆపద వస్తే చెప్పుకోడానికి ఏఎన్‌ఎమ్‌ లేరు. వార్డెన్ మేడమ్‌ వారం రోజుల నుంచి రావడం లేదు. ఇది వరకు ఒక అమ్మాయికి ఆస్తమా వస్తే తీసుకెళ్లడానికి వాహనం లేదు. తాతకి చెప్తే ఎవరికో ఫోన్‌చేసి మందులు అడిగితే అవే వేశాం. కానీ అన్ని సమస్యలు వారితో చెప్పుకోలేం. తాగడానికి మంచి నీరు లేదు. ఇక్కడ నీరు తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చి అందరు జబ్బుల పాలు అవుతున్నాం." - విద్యార్థినులు

పాఠశాల ప్రాంగాణంలోకి మేకలు రావడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుంది. పాఠశాల వెనుక భాగంలో విద్యుత్ నియంత్రిక ప్రమాదకరంగా ఉండటంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. వసతి గృహంలో వార్డెన్ లేక ఒక వృద్ధుని సహకారంతో కాలం గడుపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పాఠశాలలో తిష్టవేసిన సమస్యలకు పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.

Students Request to Himanshu : 'ఓ హిమాన్షు అన్న.. మా స్కూల్​నూ దత్తత తీసుకోండి'

శిథిలావస్థలో ప్రభుత్వ పాఠశాల.. ఆరుబయట పాఠాలు

ABOUT THE AUTHOR

...view details