కొత్తరూపు సంతరించుకున్న మద్దుల చెరువు... Maddula Cheruvu mini tank bund: జగిత్యాల జిల్లా కోరుట్లలోని మద్దుల చెరువు కొత్తరూపు సంతరించుకుంది. చెరువుల సుందరీకరణలో భాగంగా... మినీ ట్యాంక్ బండ్‌లా తీర్చిదిద్దుతున్నారు. గతంలో పిచ్చి మొక్కలు, చెత్తచెదారంతో నిండుకున్న చెరువు... ప్రస్తుతం ఆహ్లాదకరంగా మారింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వం నుంచి రూ. 3.20 కోట్లతో ప్రత్యేక నిధులు కేటాయించి చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించారు. 2016లో పనులు ప్రారంభిచినా... కొన్ని కారణాలతో ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం పనులు తుది దశకు చేరుకున్నాయి.
నందనవనంలా మద్దుల చెరువు...
Korutla Mini Tank Bund: చెరువు వద్ద ధ్యాన మందిరం, బతుకమ్మ ఘాట్, స్వాగత తోరణం, గార్డెన్ , విశ్రాంతి భవనం ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. హైమాస్ లైట్లను అమరుస్తున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తవ్వగా... మిగిలినవి త్వరతగిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్ పూర్తైతే... ఉదయపు నడకతో పాటు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే వీలుంటుందని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. నందనవనంలా మారిన మినీ ట్యాంక్ బండ్ ఆహ్లాదంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చేలా రూపుదిద్దారని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చెరువు మినీ ట్యాంక్ బండ్‌ల లేకముందు ఈ ప్రాంతం చుట్టు పరిసరాలంతా దుర్వాసనతో ఉండేది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నందునా చెరువు కొత్తరూపు సంతరించుకుంది. గతంలో పిచ్చి మొక్కలు, చెత్తచెదారంతో నిండుకున్న చెరువు ప్రస్తుతం ఆహ్లాదకరంగా మారింది. మినీ ట్యాంక్ బండ్ పనులు మొత్తం పూర్తైతే... ఉదయపు నడకతో పాటు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే వీలుంటుంది. -కోరుట్ల వాసి
ఇదీ చదవండి:'ఆర్ఆర్ఆర్' ట్రైలర్.. తారక్-చరణ్ చూసినప్పుడు రియాక్షన్ ఇదే!