తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురిలో వైభవంగా ఉగ్ర నరసింహుని డోలోత్సవం! - dharmapuri

ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు ఉగ్ర నరసింహస్వామికి డోలోత్సవం నిర్వహించారు.

లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 22, 2019, 12:21 PM IST

లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు
డోలోత్సవాల్లో భాగంగా లక్ష్మీ సమేత నరసింహస్వామిని మేళతాళాల మధ్య బ్రహ్మపుష్కరిణికి తీసుకొచ్చారు. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల మధ్య హంస వాహనంపై స్వామి వారు ప్రదక్షిణలు చేశారు. అనంతరం వేదమంత్రోచ్ఛరణల మధ్య లక్ష్మీ సమేత నరహింహస్వామికి డోలోత్సవం నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి తెప్పోత్సవం, డోలోత్సవాన్ని తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

ABOUT THE AUTHOR

...view details