జగిత్యాల జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మొత్తం 786 పాఠశాలలు, 13 ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు ఉండగా 63,938 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే తొలి రోజు ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు చేరుకున్నా విద్యార్థులు రాలేదు. జిల్లాలో వర్షాల్లేక 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున విద్యార్థులు బడికి వచ్చేందుకు విముఖత చూపారు. ఒక్కో పాఠశాలకు పది మంది కూడా హాజరు కాలేదు. ఉదయమే వచ్చిన ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.
పాఠశాలకు పది మంది విద్యార్థులు కూడా రాలేదు - విద్యార్థులు
జగిత్యాల జిల్లాలో 10 వేలు కాదు 20 వేలు కాదు 63 వేల పైచిలుకు విద్యార్థులున్నా... 6 వేల మంది కూడా మొదటి రోజు పాఠశాలలకు హాజరుకాలేదు. ఎండలు ఎక్కువగా కాస్తున్నందునే బడికి రావడానికి పిల్లలు విముఖత చూపారని పలువురు చెబుతున్నారు.
పాఠశాలకు పది మంది విద్యార్థులు కూడా రాలేదు