Lakshmipur Paddy farmers protest : వరి వేసింది మొదలు పంట కోసే వరకు రైతులకు తిప్పలు తప్పటం లేదు. ధాన్యం అమ్ముకుంటే డబ్బులు వస్తాయనే ఆశలపై మిల్లర్లు నీళ్లు చల్లుతున్నారు. క్వింటా ధాన్యంపై తరుగు పేరిట 8 కిలోల కోత విధిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మిల్లర్లు దోపిడితో ఎకరాకు రూ.8 నుంచి 10 వేలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేను జగిత్యాల సొసైటీలో వడ్లు తూకం వేయించాను. 187 బస్తాలకు గాను 176 బస్తాలు వేశారు. నా వడ్లలో 4.40 క్వింటాలు రైసు మిల్లర్లు కట్ చేశారు. అలా అయితేనే తీసుకుంటామని తేల్చి చెప్పారు. దిక్కులేక నేను సరేనన్నాను. ఒక్క నామీద నాలుగు క్వింటాల వడ్లు పోతే... పది లారీలు మీద 60 క్వింటాల వడ్లు పోతున్నాయి. రైసు మిల్లర్లు ఇలా దోచుకుంటే మేం ఎలా బతకాలి?
-రైతు, లక్ష్మిపూర్
'పట్టించుకోవడం లేదు'
Paddy procurement problems : ఇప్పటికే జగిత్యాల జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిల్లర్లు కోతలు విధిస్తున్నట్లు అధికారులకు తెలిసినా పట్టించుకోటంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్లకు కొమ్ముకాస్తురన్నారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ధాన్యం అమ్మిన రైతులు రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఉద్యమించాలని నిర్ణయించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలోని రైతుల వద్దకు తిరిగి వినతి పత్రాలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు అందజేయాలని నిర్ణయించారు.
నేను 400 క్వింటాల వడ్లు పండించినా. 5 క్వింటాలు కట్ అయినయ్. రూ.పదివేలు నష్టపోయిన. ఏజ్ బార్ కావడంతో నేను ఎక్కడకూ పోలేకపోయిన. మరి ఇంతలా నష్టం చేస్తుంటే మేం ఏం చేయాలి? పబ్లిక్ కూడా బతకాలి కదా.