కుటుంబ కలహాల కారణంగా ముక్కుపచ్చలారని కన్న కూతురుకి విషం తాగించి హత్య చేసేందుకు యత్నించాడు ఓ తండ్రి. తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా బాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బోదనపు సంజీవ్‌కు ఇద్దరు భార్యలు... చిన్న భార్య స్వప్నతో గత కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఇద్దరి మధ్యలో జరుగుతున్న గొడవపై స్వప్న భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న కూతురుకి తండ్రి సంజీవ్ విషం తాగించాడు. విషయం తెలుసుకున్న తల్లి... చిన్నారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించింది. కొద్దిసేపటికే సంజీవ్ కూడా విషం తాగాడు. ఇద్దరు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కన్న కూతురుకు విషం తాగించిన తండ్రి - father
జగిత్యాల జిల్లా బాలపల్లి గ్రామంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా కన్న తండ్రే తన కూతురికి విషం తాగించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కన్న కూతురుకు విషం తాగించిన తండ్రి