రాష్ట్రంపై రెండో దశ కరోనా తన పంజా విసురుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండటం వల్ల ఆక్సిజన్ సరఫరా సమస్య ఏర్పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కిట్ల కొరతతో నిర్ధరణ పరీక్షలు నిలిపివేస్తున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తి మరింత వేగంగా పుంజుకుంటోంది.
కోరుట్ల ఎమ్మెల్యే కుమారుడి ఉదారత.. ఆక్సిజన్ సిలిండర్లు అందజేత - corona cases in jagtial district
రెండో దశ కరోనా రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వల్ల కరోనా పరీక్ష చేసే కిట్ల కొరత ఏర్పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. కరోనా పరీక్ష కిట్లు, ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
కరోనా కిట్లు, కరోనా కిట్ల పంపిణీ, మెట్పల్లిలో కరోనా కిట్ల పంపిణీ, కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా వార్తలు
ఈ సమస్య పరిష్కారానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు కల్వకుంట్ల సంజయ్.. మెట్పల్లి ఆస్పత్రికి తన సొంత డబ్బుతో ఆరు ఆక్సిజన్ సిలిండర్లు, 500 కరోనా పరీక్ష కిట్లను అందజేశారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని సూచించారు.